Janasena: చేగువేరాను పవన్ కల్యాణ్ మర్చిపోయారు.. మన్మథుడిని అనుసరిస్తున్నారు: వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్

  • పవిత్ర  బంధాన్ని పవన్  కొనసాగించలేకపోయారు
  • వివాహబంధంలో ఉంటూ అపవిత్రబంధాలా?  
  • రాజకీయాల్లోనూ అదే అనైతికతను పవన్ ప్రదర్శించారు

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ తీవ్ర విమర్శలు చేశారు. అనంతపురంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చేగువేరా అనే ఒక విప్లవకారుడిని పవన్ కల్యాణ్ అభిమానిస్తున్నారు కానీ, నిజ జీవితంలో మాత్రం ఒక మన్మథుడిని అనుసరిస్తున్నారని విమర్శించారు. చేగువేరాను మర్చిపోయారు.. మన్మథుడిని ఫాలో అయ్యారని, ప్రశ్నించే తత్వాన్ని పవన్ మర్చిపోయారని  ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘‘వివాహం’ అనే పవిత్ర  బంధాన్ని పవన్ కల్యాణ్ కొనసాగించలేకపోయారు. వివాహబంధంలో ఉంటూ ఏ విధంగా అయితే అపవిత్ర బంధాలు కొనసాగించారో, రాజకీయాల్లోనూ అదే అనైతికతను పవన్ కల్యాణ్ గారు ప్రదర్శించారు.

గతంలో టీడీపీతో జనసేన కలిసినప్పుడు తాను ప్రజల ముందుండి ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ ఇప్పుడవన్నీ మర్చిపోయారని అన్నారు. ఎలక్షన్లకు ముందు ‘లోకేశ్ అవినీతి’..అంటూ ఏవేవో మాట్లాడారు, ఇప్పుడేమో వాటన్నింటినీ మర్చిపోయారని అన్నారు. నాడు తిరుపతి సభలో ‘వాచ్ డాగ్’ లా ఉంటానని చెప్పిన పవన్, లింగమనేని అక్రమ కట్టడం, ఓటుకు నోటు వ్యవహారాల్లో చంద్రబాబు ఉంటే పవన్ ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. టీడీపీ హయాంలో నీరు-మట్టి దోపిడీని, రైతుల దయనీయ స్థితిని, తాత్కాలిక కట్టడాల్లో జరిగిన అవినీతిని గానీ పవన్ కల్యాణ్ ప్రశ్నించిన పాపాన పోలేదని విమర్శించారు.

ఏపీలో పేద పిల్లలకు ఉన్నత విద్యను అందించాలన్న ఉద్దేశంతో ఇంగ్లీషు మీడియంలో విద్యా బోధన చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు తగదని అన్నారు. దీనికి మతం జోడించి దుష్ప్రచారం చేస్తున్నారని ఓ పత్రికపై మండిపడ్డారు. ఇంగ్లీషు మీడియంలో చదువుకున్న వాళ్లందరూ క్రైస్తవ మతంలోకి పోయే అభిప్రాయం వచ్చినట్టు చెబుతున్నారని, ఎందుకు, ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News