ABN: టీవీ5, ఏబీఎన్ ఛానళ్లపై నిషేధాన్ని ఎత్తివేయాలి: లోక్ సభలో గల్లా జయదేవ్

  • మీడియా స్వేచ్ఛను అణగదొక్కేలా ఏపీ ప్రభుత్వం జీవోను తీసుకొచ్చింది
  • ఈ జీవో విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి
  • ఓ జర్నలిస్టును ఎమ్మెల్యే అనుచరులు హత్య చేశారు

ఏపీలో టీవీ5, ఏబీఎన్ ఛానళ్లపై నిషేధం ఉందని, దాన్ని ఎత్తివేయాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ, మీడియా స్వేచ్ఛను అణగదొక్కేలా ఏపీ ప్రభుత్వం జీవోను తీసుకొచ్చిందని చెప్పారు. ఈ జీవో విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని కార్యదర్శులకు ఇచ్చారని తెలిపారు. మంత్రులు, అధికారులకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే కేసులు పెట్టడం ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛను హరించడమేనని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే ఓ జర్నలిస్టును ఒక ఎమ్మెల్యే అనుచరులు హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ABN
TV5
Galla Jayadev
Lok Sabha
  • Loading...

More Telugu News