Roja: ట్రయిలరే చూస్తున్నాం... అసలు సినిమా ముందుంది: రోజా

  • నిన్న రోజా పుట్టిన రోజు
  • వినూత్న కార్యక్రమానికి శ్రీకారం
  • జగన్ పాలనలో అసలైన సినిమా ముందుందని వ్యాఖ్య

చిత్తూరు జిల్లా నగరిలో కిలో ప్లాస్టిక్ తెచ్చిస్తే, కిలో బియ్యం ఇచ్చేలా వినూత్న పథకాన్ని వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. ఆదివారం నాడు రోజా పుట్టినరోజు కాగా, ప్లాస్టిక్ రహిత సమాజ సృష్టికి తనవంతు చర్యగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించానని అన్నారు. ప్లాస్టిక్ వస్తువులు భూమిలో కలిసేందుకు 400 సంవత్సరాలు పడుతుందని, హానికర ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాల్సివుందని ఆమె అన్నారు.

సీఎం జగన్ పాలనలో ఇంతవరకూ ట్రయిలర్ ను మాత్రమే చూస్తున్నామని, అసలైన సినిమా ముందుందని రోజా వ్యాఖ్యానించారు. కాగా, ఈ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప కూడా పాల్గొని, దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు.

Roja
Jagan
Chittoor District
Nagari
  • Loading...

More Telugu News