Bonykapoor: శ్రీదేవి గురించి మాట్లాడలేక కన్నీటిపర్యంతమై ప్రసంగం వెంటనే ఆపేసిన బోనీకపూర్!

  • హైదరాబాద్ లో ఏఎన్నార్ అవార్డుల కార్యక్రమం
  • శ్రీదేవికి ఈ ఏడాది అక్కినేని అవార్డు ప్రకటన
  • తీసుకునేందుకు వచ్చిన బోనీకపూర్

హైదరాబాద్ లో నిర్వహించిన అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డుల కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత బోనీకపూర్ కూడా హాజరయ్యారు. ఈ ఏడాది ఏఎన్నార్ నేషనల్ అవార్డు శ్రీదేవికి కూడా ప్రకటించడంతో ఆమె తరఫున అవార్డు స్వీకరించేందుకు బోనీ వచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ లోని సెవెన్ ఎకర్స్ లో జరిగిన ఈ ఫంక్షన్ లో శ్రీదేవి గురించి మాట్లాడే సమయంలో బోనీకపూర్ ఒక్కసారిగా భావోద్వేగాలకు గురయ్యారు. అందరికీ నమస్కారం అంటూ మొదలుపెట్టిన ఆయన ఆపై కొనసాగించలేకపోయారు.

ఓవైపు శ్రీదేవి స్మృతులు ఆయన కళ్లలో సుడులు తిరుగుతుంటే ఒక్క ముక్క మాట్లాడలేక కన్నీటిపర్యంతమయ్యారు. దాంతో సభకు విచ్చేసిన పెద్దలు అంటూ టి.సుబ్బరామిరెడ్డి, నాగార్జున, చిరంజీవి తదితరులకు ధన్యవాదాలు తెలిపి గద్గద స్వరంతో ఇక తనవల్ల కాదంటూ ప్రసంగం ఆపేశారు. అంతకుముందు బోనీకపూర్ కు చిరంజీవి శాలువా కప్పి మెమెంటో, ప్రశంసాపత్రం అందించారు.

Bonykapoor
Sridevi
Nagarjuna
ANR
Hyderabad
  • Loading...

More Telugu News