Ashwathama Reddy: అశ్వత్థామరెడ్డి దీక్ష భగ్నం... ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు

  • నిన్నటినుంచి తన నివాసంలో అశ్వత్థామరెడ్డి దీక్ష
  • ఆరోగ్యం దెబ్బతింటోందన్న వైద్యులు
  • కార్మికులకు, పోలీసులకు మధ్య తోపులాట

తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయనను బలవంతంగా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, సమ్మెపై కేసీఆర్ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ అశ్వత్థామరెడ్డి తన నివాసంలోనే నిన్న దీక్ష చేపట్టారు. దీక్ష కొనసాగిస్తే ఆరోగ్యం దెబ్బతింటుందన్న వైద్యుల సూచనను కూడా అశ్వత్థామరెడ్డి పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు బీఎన్ రెడ్డి నగర్ లోని అశ్వత్థామరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన దీక్షను భగ్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆర్టీసీ కార్మికులకు మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. అయినప్పటికీ భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న పోలీసులు అశ్వత్థామరెడ్డిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Ashwathama Reddy
Osmania
Telangana
TSRTC
TRS
  • Loading...

More Telugu News