assembly sessions: అసెంబ్లీలో వంశీ స్థానం ఎక్కడ : ప్రత్యేక సీటు కేటాయించే అవకాశం?

  • టీడీపీ నుంచి సస్పెండ్ కావడంతో ఆ పార్టీతో సంబంధం లేదు
  • వైసీపీలో చేరనందున ఆ పార్టీతోనూ సంబంధం లేదు
  • స్వతంత్ర  ఎమ్మెల్యేగా ప్రకటిస్తామన్న స్పీకర్

వచ్చే నెలలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటి వరకు ఏపీ అసెంబ్లీలో అధికార వైసీపీకి 151 మంది, విపక్ష టీడీపికి 23 మంది, జన సేనకు ఒకరు సభ్యులున్నారు. తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ కావడంతో ఇక పై ఆయనకు ఆ పార్టీతో ఎటువంటి సంబంధం ఉండదు. ఆయన అధికార వైసీపీకి మద్దతు ప్రకటించినా ఆ పార్టీలో అధికారికంగా చేరలేదు. దీంతో ఆ పార్టీ సభ్యునిగాను పరిగణించరు. దీంతో ఆయనకు ప్రత్యేక సీటు కేటాయించే అవకాశం ఉంది.

వంశీని తటస్థ అభ్యర్థిగా పరిగణిస్తామని ఇప్పటికే ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించి ఉన్నారు. దీంతో రానున్న అసెంబ్లీ సమావేశాల్లో మూడు విభాగాలకు బదులు నాలుగు విభాగాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. జన సేనకు ఉన్న ఒక్క ఎమ్మెల్యే మాదిరిగా స్వతంత్ర ఎమ్మెల్యేగా ఆయన పక్కన వంశీకి సీటు కేటాయించే అవకాశం ఉంది.

assembly sessions
winter
MLa vamsi
  • Loading...

More Telugu News