George Reddy: జార్జి రెడ్డి ప్రీరిలీజ్ వేడుకకు అనుమతి నిరాకరణ... పవన్ వస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందన్న పోలీసులు

  • విద్యార్థి నేత జీవితకథతో జార్జి రెడ్డి బయోపిక్
  • నవంబరు 22న రిలీజ్
  • ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్

ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం జార్జి రెడ్డి. ఈ బయోపిక్ నవంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో రేపు నిర్వహించేందుకు చిత్రబృందం పోలీసుల అనుమతి కోరింది. అయితే, ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా రానుండడంతో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు అనుమతి నిరాకరించారు. పవన్ వస్తే అభిమానులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని, వారిని నియంత్రించడం కష్టమవుతుందని పోలీసులు భావిస్తున్నట్టు తెలిసింది.

George Reddy
Biopic
Tollywood
Pawan Kalyan
Prerelease
  • Loading...

More Telugu News