Chinthamaneni Prabhakar: నేను ఆకులు రాలిపోయిన చెట్టుని... నా దగ్గరేం ఉంటుంది మసాలా?: మీడియాతో చింతమనేని సరదా వ్యాఖ్యలు

  • చింతమనేనికి బెయిల్
  • మీడియా సమావేశంలో ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు
  • మీడియా ప్రతినిధులతో చమత్కారం

దెందులూరు మాజీ శాసనసభ్యుడు, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ బెయిల్ పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రత్యర్థులపై తీవ్ర వ్యాఖ్యలు గుప్పించిన ఆయన చివర్లో మీడియా ప్రతినిధులతో సరదాగా వ్యవహరించారు. తన వద్ద మసాలా ఏం ఉంటుందని, తాను ఆకులు రాలిపోయిన చెట్టులాంటి వాడ్నని చమత్కరించారు. ప్రజలు నీరు పోస్తే చిగురిస్తానని అన్నారు.

ఓ మీడియా ప్రతినిధిని ఉద్దేశించి మాట్లాడుతూ, తమ్ముడూ నువ్వు పేదవాడివని నీకు ఓ ఇళ్ల స్థలం కూడా ఇప్పించాను. అయినా నీకు కనికరం లేదురా తమ్ముడూ అంటూ నవ్వులు పూయించారు. ఈ సందర్భంగా పులి, పులి అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. అంతకుముందు, ఓ కార్యకర్త మాట్లాడుతూ, పోలీసులు జగన్ కు భయపడకపోయినా మీకు భయపడ్డారు, లేకపోతే ఏలూరంతా రచ్చే అంటూ వ్యాఖ్యానించగా, "నువ్వు ఆగరొరేయ్ గజా! అంటూ వారించారు.

Chinthamaneni Prabhakar
Telugudesam
Chandrababu
Jagan
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News