Chittoor District: కిలో ప్లాస్టిక్ తెచ్చి, కిలో బియ్యం తీసుకువెళ్లండి!: నగరి ఎమ్మెల్యే రోజా ఆఫర్

  • సామాజిక మాధ్యమాల్లో స్వయంగా పోస్టు చేసిన రోజా
  • 'స్వచ్ఛ నగరి' తన లక్ష్యమని ప్రకటన
  • ప్లాస్టిక్ ను ఏరివేసి ఆరోగ్యాన్ని కాపాడుకుందామని పిలుపు

ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా సెల్వమణి నియోజకవర్గం నుంచి ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు 'బియ్యం ' పథకాన్ని ప్రవేశపెట్టారు. కిలో ప్లాస్టిక్ వ్యర్థాలు తెచ్చి కిలో బియ్యం తీసుకు వెళ్లాలంటూ ఆఫర్ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా రోజా సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. నియోజకవర్గంలో ప్రతి మున్సిపాలిటీ, పంచాయతీ, వార్డు పరిశుభ్రంగా ఉండాలని, ఇందుకోసం ఎక్కడ ప్లాస్టిక్ కనిపించినా ఏరివేయాలని పిలుపునిచ్చారు. 'స్వచ్ఛ నగరి' నియోజకవర్గాన్ని సాధించి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం, అందరికీ ఆదర్శంగా నిలుద్దాం అని సూచించారు.

Chittoor District
nagari
MLA Roja
rice scheme
  • Loading...

More Telugu News