India: నిప్పులు చెరుగుతున్న మొహమ్మద్ షమీ

  • ఒక్క రన్ ఇచ్చి రెండు వికెట్లు కూల్చిన షమీ
  • 44 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్
  • ఘోర ఓటమి దిశగా అడుగులు వేస్తున్న బంగ్లా

ఇండోర్ లో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఘోర ఓటమి దిశగా అడుగులు వేస్తోంది. భారత పేస్ త్రయం ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, మొహమ్మద్ షమీల బంతులను ఎదుర్కోవడానికి బంగ్లా బ్యాట్స్ మెన్ తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా షమీ నిప్పులు చెరిగే బంతులతో బంగ్లాను వణికిస్తున్నాడు. 7 బంతుల్లో కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లను కూల్చాడు షమీ.

దీంతో, బంగ్లాదేశ్ కేవలం 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. తద్వారా భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే ఇంకా 299 పరుగులు వెనుకబడి ఉంది. టీమిండియా ఊపు చూస్తుంటే... మ్యాచ్ ను ఈరోజే ముగించేట్టు ఉన్నారు. బంగ్లా బ్యాట్స్ మెన్లలో షాద్మాన్ ఇస్లాం 6 పరుగులు, ఇమ్రుల్ 6, మోమినుల్ హక్ 7, మొహమ్మద్ మిథున్ 18 పరుగులు చేసి ఔటయ్యారు. ముష్ఫికర్ రహీం, మహ్ముదుల్లాలు క్రీజ్ లో ఉన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News