Crime News: నాన్న రూపంలోని కామాంధుడికి మూడేళ్ల జైలు

  • కూతురి పైనే కన్నేసి లైంగిక వేధింపులు
  • భర్తలేని సమయంలో అసభ్యంగా ప్రవర్తన
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

వయసు, వావివరుసలు మర్చిపోయి కూతురి పైనే కన్నేసి లైంగిక వేధింపులకు గురిచేసిన ఓ కామాంధుడికి న్యాయస్థానం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ప్రాసిక్యూషన్ కథనం మేరకు, కొత్తగూడెం పట్టణానికి చెందిన రమేష్ (55) కుమార్తె అదే పట్టణంలో వేరొకచోట భర్తతో కలిసి ఉంటోంది. 2016లో కుమార్తెను చూసేందుకు రమేష్ ఆమె ఇంటికి వచ్చాడు. భర్తలేని సమయంలో ఆమెను లైంగికంగా వేధిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. తండ్రి తీరుతో విస్తుపోయిన ఆమె మనస్తాపానికి గురై స్థానిక మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి చార్జిషీట్ దాఖలు చేశారు. దాదాపు మూడేళ్లపాటు కేసును విచారించిన జిల్లా మూడో అదనపు జ్యుడీషియల్ మొదటి శ్రేణి న్యాయమూర్తి దేవీ మానస నిందితుడిపై ఆరోపణలు నిజమేనన్న నిర్ధారణకు వచ్చారు. దీంతో రమేష్ కు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతోపాటు 30 వేల రూపాయలు జరిమానా విధించారు.

Crime News
leagel
father convicted
sexual herasment
  • Loading...

More Telugu News