Ramoji Rao: రామోజీరావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సుజనా చౌదరి

  • నేడు రామోజీరావు జన్మదినం
  • నేటితో 82వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన రామోజీ
  • 1936 నవంబర్ 16న జన్మించిన రామోజీరావు

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు నేడు పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈరోజుతో ఆయన 82వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో ఓ వ్యవసాయ కుటుంబంలో ఆయన జన్మించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగారు. ఆయన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 'ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ రామోజీరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు' అంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News