Atchennaidu: ప్రభుత్వం మారితే ఆ భూములను స్వాధీనం చేసుకుంటుందన్న విషయాన్ని కొనుగోలుదారులు గ్రహించాలి: అచ్చెన్నాయుడు

  • ప్రభుత్వ ఆస్తులమ్మే ప్రక్రియను అడ్డుకుంటామని వెల్లడి
  • విజయవాడలో మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు
  • పవన్ ఢిల్లీ పర్యటనతో టీడీపీకి సంబంధం లేదని స్పష్టీకరణ

టీడీపీ నేత అచ్చెన్నాయుడు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం భూములు విక్రయించే ప్రక్రియను అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం మారితే ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుందన్న సంగతి కొనుగోలుదారులు గుర్తెరగాలని టీడీపీ నేత స్పష్టం చేశారు. అంతేగాకుండా, చంద్రబాబునాయుడు ఇసుక అంశంపై చేపట్టిన దీక్షపైనా తన అభిప్రాయాలు వెల్లడించారు. ఈ దీక్షకు ప్రజాస్పందన వెల్లువెత్తిందని, ప్రభుత్వంపై ప్రజల్లో ఎంతటి వ్యతిరేక భావం ఉందో దీన్నిబట్టే అర్థమవుతుందని అన్నారు.

ఇక, పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లడానికి, తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అచ్చెన్న స్పష్టం చేశారు. మున్ముందు రాష్ట్రంలోని సమస్యలపై అన్ని పార్టీలను, ప్రజాసంఘాలను కలుపుకుని వెళతామని వెల్లడించారు.

Atchennaidu
Telugudesam
Chandrababu
Andhra Pradesh
Jagan
YSRCP
  • Loading...

More Telugu News