Gang Rape at Noida: నోయిడాలో యువతిపై సామూహిక అత్యాచారం

  • తెలిసిన వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానంటే నమ్మి పార్కుకు వెళ్లిన యువతి
  • విశ్వాస ఘాతుకానికి ఒడిగడుతూ అత్యాచార యత్నం
  • అతన్ని కొట్టి మరో ఐదుగురు దుండగుల అత్యాచారం

నోయిడాలో యువతిపై సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకుంది. బాధితురాలికి తెలిసిన వాడే ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా.. ఇదే అదనుగా అక్కడే ఉన్న మరో ఐదుగురు ఆమెకు సహాయం చేస్తున్నట్లు నటిస్తూ.. ఆ వ్యక్తిని కొట్టారు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు తెలపటంతో నిన్న ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పోలీసులు వివరాలను వెల్లడించారు.

21 ఏళ్ల యువతి ఉద్యోగం చేసి తన కుటుంబానికి ఆసరాగా ఉండాలనుకుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె ఉద్యోగాన్వేషణలో ఉండగా తన సోదరుడికి పరిచయమున్న వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పార్క్ కు రమ్మన్నాడని.. సోదరుడి స్నేహితుడే కదా అని పార్క్ కు వెళ్లిన యువతిపై అతడు లైంగిక దాడికి యత్నించాడన్నారు. అదే సమయంలో పార్కులో ఉన్న ఐదుగురు వ్యక్తులు అతడిని కొట్టి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారని చెప్పారు. కేసు నమోదు చేశామని.. నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, మిగిలిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారన్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

Gang Rape at Noida
Four accused arrested
21 year old women
At Park
  • Loading...

More Telugu News