Sania Mirza Birthday: ‘హాయ్ మిర్చీ.. హ్యాపీ బర్త్ డే’.. సానియా మీర్జాకు యువరాజ్ సింగ్ విషెస్

  • ‘థాంక్యూ మోటూ’ అంటూ సానియా జవాబు
  • సోషల్ మీడియాలో యువీ, సానియా సరదా సంభాషణలు
  • వైరల్ గా మారిన వీరి పరస్పర కామెంట్స్

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మధ్య ట్విట్టర్ మాధ్యమంగా సరదా సంభాషణలు కొనసాగాయి. ఈ రోజు సానియా మీర్జా పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో యువరాజ్ ‘హాయ్ మిర్చీ.. నా ప్రియమైన స్నేహితురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని తెలిపాడు. ఈ ట్వీట్ కు సానియా కూడా దీటుగా జవాబిచ్చింది. ‘హాయ్ మోటూ.. థాంక్యూ’ అని తెలిపింది. కొన్ని రోజుల క్రితం వీరిద్దరి మధ్య ఇన్ స్టా గ్రామ్ లో సరదా సంభాషణ జరిగింది. ‘నున్నటి గడ్డంతో బాగున్నానా.. మళ్లీ పెంచనా’ అని పోస్ట్ చేయగా, ‘నున్నటి గడ్డం మాటున ఏం దాగుందో, గడ్డం పెంచాల్సిందే’ అంటూ సానియా జవాబిచ్చింది. వీరిద్దరి పరస్పర ట్వీట్లు అభిమానులకు వినోదాన్ని పంచుతున్నాయి.

Sania Mirza Birthday
Ex.Cricketer Yuvaraj Sing
Each otner Tweets
  • Loading...

More Telugu News