Chidambaram: చిదంబరంకు మరోసారి నిరాశ... బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు

  • ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన చిదంబరం
  • చిదంబరంపై సీబీఐ, ఈడీ దర్యాప్తు
  • ఇప్పటికే పలుమార్లు బెయిల్ కు దరఖాస్తు

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరంకు మరోసారి చుక్కెదురైంది. ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో ఆయన అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆయన సీబీఐ, ఈడీ దర్యాప్తులు ఎదుర్కొంటున్నారు. తాజాగా మరోసారి బెయిల్ కు దరఖాస్తు చేసుకున్న ఈ సీనియర్ రాజకీయవేత్తకు నిరాశ తప్పలేదు. చిదంబరం బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించింది. దాంతో ఆయన మరికొంత కాలం తీహార్ జైల్లో ఉండకతప్పదు.

Chidambaram
Bail
High Court
New Delhi
INX Media
Congress
  • Loading...

More Telugu News