Rajinikanth: తమిళనాడులో రాజకీయ వెలితిని భర్తీ చేయగలిగేది ఒక్క రజనీకాంత్ మాత్రమే: అళగిరి

  • చెన్నై ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడిన అళగిరి
  • తమిళనాడులో నాయకత్వ లోటు నిజమేనని వ్యాఖ్యలు
  • డీఎంకేతో తనకు సంబంధంలేదని వెల్లడి

తమిళనాడులో రాజకీయ వెలితి ఏర్పడిందని మేధావి వర్గాలు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో, ఆ శూన్యాన్ని భర్తీ చేయగలిగే నాయకుడు ఒక్క రజనీకాంత్ మాత్రమే అని డీఎంకే మాజీ అధ్యక్షుడు అళగిరి అభిప్రాయం వ్యక్తం చేశారు. చెన్నై విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమిళనాడులో నాయకత్వ లోటు కనిపిస్తోందన్న విషయం నిజమేనని అన్నారు. రజనీకాంత్ పార్టీ ఏర్పాటు చేసి రాజకీయాల్లోకి వస్తే తమిళనాడు రాజకీయాలను కచ్చితంగా ప్రభావితం చేస్తారని తెలిపారు.

ఇక డీఎంకే గురించి ప్రశ్నించగా ప్రస్తుతం తాను ఆ పార్టీలో లేనని, దాంతో తనకు ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుల్లో ఒకరైన అళగిరి గతంలో కేంద్రమంత్రిగానూ వ్యవహరించారు.

Rajinikanth
Azhagiri
DMK
Tamilnadu
Chennai
  • Loading...

More Telugu News