Sushant Singh Rajput: డెంగీతో బాధపడుతున్న బాలీవుడ్ హీరో

  • కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్
  • డెంగీ సోకినట్టు వైద్య పరీక్షల్లో వెల్లడి
  • విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు

ఇరు తెలుగు రాష్ట్రాలనే కాకుండా యావత్ దేశాన్ని డెంగీ జ్వరాలు కుదిపేస్తున్నాయి. డెంగీ దెబ్బకు సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు బాధితులుగా మిగిలిపోతున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెంగీ బారిన పడ్డాడు. యూరప్ ట్రిప్ ను ముగించుకుని వచ్చిన సుశాంత్... అనారోగ్య కారణాలతో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఈ పరీక్షలో డెంగీ సోకినట్టు తేలింది. ఈ నేపథ్యంలో, తన అబుదాభి పర్యటనను సుశాంత్ రద్దు చేసుకున్నాడు.

ముంబై మిర్రర్ కథనం ప్రకారం... గత కొన్ని రోజులుగా సుశాంత్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. డెంగీ సోకినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో, తన వర్క్ షెడ్యూల్ ను ఆయన రీషెడ్యూల్ చేసుకున్నాడు. ఈ వారంలో ఓ కార్యక్రమం కోసం సుశాంత్ అబుదాభి వెళ్లాల్సి ఉంది. కానీ, విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించడంతో, అబుదాభి పర్యటనను రద్దు చేసుకున్నాడు. మరోవైపు, సుశాంత్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.

ఈ ఏడాది పలువురు సెలెబ్రిటీలు డెంగీ బారిన పడ్డారు. ధర్మేంద్ర, జైన్ ఇమామ్, టీవీ నటుడు మొహ్సిన్ ఖాన్ డెంగీ కారణంగా బాధపడ్డారు.

Sushant Singh Rajput
Dengue
Bollywood
  • Loading...

More Telugu News