Indore Test: కోహ్లీ డకౌట్.. మయాంక్ హాఫ్ సెంచరీ

  • రెండో బంతికే ఎల్బీడబ్ల్యూ అయిన కోహ్లీ
  • భారత్ స్కోరు 146/3
  • మూడు వికెట్లను పడగొట్టిన అబు జయేద్

ఇండోర్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. తాను ఎదుర్కొన్న రెండో బంతికే డకౌట్ గా వెనుదిరిగాడు. అబు జయేద్ వేసిన బంతికి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. మరోవైపు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఈరోజు ఒక వికెట్ నష్టానికి 86 పరుగులతో ఆటను ప్రారంభించిన భారత్ కు కాసేపట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. 43 పరుగులతో క్రీజులోకి వచ్చిన పుజరా 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అబు జయేద్ బౌలింగ్ లో సబ్ స్టిట్యూట్ సైఫ్ హసన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కోహ్లీ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ 63 పరుగులు, రహానే 21 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. భారత్ ప్రస్తుత స్కోరు మూడు వికెట్ల నష్టానికి 146 పరుగులు. ఈ మూడు వికెట్లను జయేద్ పడగొట్టడం గమనార్హం. ప్రస్తుతం బంగ్లాదేశ్ స్కోరు (150) కంటే భారత్ 4 పరుగుల వెనుకబడి ఉంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News