Andhra Pradesh: కాళేశ్వరం ప్రాజక్టుకు జాతీయ హోదా కల్పించొద్దు: సుప్రీంకు ఏపీ విజ్ఞప్తి

  • ఏపీ రైతుల ప్రయోజనాలకు కాళేశ్వరం ప్రాజెక్టు విరుద్ధం
  • పోలవరం విషయంలో అభ్యంతరాలు చెప్పే హక్కును తెలంగాణ కోల్పోయింది
  • తెలంగాణను పార్టీగా పరిగణించాల్సిన పనిలేదు

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వొద్దంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఏపీలోని రైతుల ప్రయోజనాలకు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి విరుద్ధమని పేర్కొన్న ఏపీ ప్రభుత్వం పోలవరం విషయంలో అభ్యంతరాలు చెప్పే హక్కు తెలంగాణ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. తెలంగాణలోని ముంపు ప్రాంతాలను ఏపీలో కలిపేయడంతో అభ్యంతరాలు చెప్పే హక్కు తెలంగాణ కోల్పోయిందని పేర్కొంది. ఈ కేసులో తెలంగాణను పార్టీగా పరిగణించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.

అఫిడవిట్‌లోని అంశాలను పరిశీలించి విభజన చట్టంలోని హామీలను త్వరగా అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరింది. అలాగే, పిటిషనర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయాలని అభ్యర్థించింది. విభజన హామీల అమలులో జాప్యం జరుగుతోందంటూ తెలంగాణకు చెందిన బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి ప్రతిగా తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పుడు దీనిపై ఏపీ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.

Andhra Pradesh
Kaleshwaram project
Telangana
polavaram project
  • Loading...

More Telugu News