Congress: టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం పార్టీ పెద్దలకు బయోడేటా పంపా: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

  • కాంగ్రెస్ ను  అధికారంలోకి తేవడానికి అద్భుతమైన మందు ఉంది
  • అవసరమైనప్పుడు బయటకు తీస్తా
  • పార్టీలో తప్పుచేస్తే నిలదీసే హక్కు కార్యకర్తలకు ఉంటుంది

రాష్టంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి తన వద్ద అద్భుతమైన మందు ఉందని, అవసరమైనప్పుడు దానిని బయటకు తీస్తానని పార్టీ సీనియర్ నేత, తెలంగాణ శాసన సభ్యుడు జగ్గారెడ్డి అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీలో ఎవరు తప్పుచేసినా నిలదీసే హక్కు కార్యకర్తలకు ఉంటుందని అన్నారు. తాను టీపీసీసీ పదవిని కోరుకుంటున్నట్లు జగ్గారెడ్డి తన మనసులోని మాటను ప్రకటించారు.

 ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వైదొలిగిన తర్వాత ఆ పదవి తనకు ఇవ్వాలని ఏఐసీసీకి విన్నవించానన్నారు. ఈ నెల 16న ఢిల్లీలో ఏఐసీసీ సమావేశం జరగనుందన్నారు. తన బయోడేటాను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులకు పంపానని తెలిపారు.

Congress
TPCC
MLA Jaggareddy
Wish to take TPCC president post
  • Loading...

More Telugu News