India-Bangladesh First Test Match: బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆలౌట్

  • ఇండోర్ వేదికగా కొనసాగుతున్న భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్
  • రెచ్చిపోయిన భారత పేసర్లు, హ్యాట్రిక్ సాధించిన బౌలర్లు
  • షమీకి 3, ఇశాంత్ కు 2, ఉమేశ్ కు 2 వికెట్లు

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ స్టేడియంలో బంగ్లాదేశ్-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత బౌలర్లు రెచ్చి పోయారు. పేసర్ల ధాటికి బంగ్లా బ్యాట్స్ మెన్  తలవంచారు. తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులు చేసి ఆలౌటయ్యారు. భారత బౌలర్లలో పేసర్లు మహ్మద్ షమీ 27 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, ఉమేష్ యాదవ్ 47 పరుగులిచ్చి 2 వికెట్లు, ఇశాంత్ శర్మ 20 పరుగులిచ్చి 2 వికెట్లు, అశ్విన్ 43 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు నాలుగు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ 6 పరుగులతో, రోహిత్ శర్మ 2 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు.

టీమిండియా బౌలర్ల హ్యాట్రిక్

టీమిండియా బౌలర్లు వరుసగా మూడు వికెట్లు పడగొట్టారు. షమీ ముష్ఫికర్ రహీమ్(43పరుగులు), మెహిది హసన్ (పరుగులేమీ చేయాకుండానే)ను వరుస బంతుల్లో షమీ పెవిలియన్ పంపించాడు. అప్పటికి ఓవర్ పూర్తి కావడంతో తర్వాత ఓవర్ వేసిన ఇశాంత్ శర్మ తొలిబంతికి లిటన్ దాస్ ను(21 పరుగులు) ఔట్ చేశాడు. దీనితో బౌలర్ల ఖాతాలో హ్యాట్రిక్ నమోదయినట్లయింది.

India-Bangladesh First Test Match
Bangladesh first Innings 150 Allout
Indian bowlers Hatrick
  • Loading...

More Telugu News