Jarkhand: తమ్ముడిని చంపి జైలుకెళ్లిన అన్న... బీజేపీ, కాంగ్రెస్ తరఫున ఇద్దరి భార్యలూ అసెంబ్లీకి పోటీ!

  • ఈ సంవత్సరం జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు
  • తోడికోడళ్లకు టిక్కెట్లు ఇచ్చిన బీజేపీ, కాంగ్రెస్
  • ఝరియాలో ఆసక్తికరంగా మారిన పోరు

జార్ఖండ్ కు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఝరియా అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్న రెండు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు తోడికోడళ్లకు టికెట్లు ఇచ్చాయి. సాధారణంగా ఎన్నికలంటే, అన్నా తమ్ముళ్లు, దగ్గరి బంధువులు, పలుమార్లు మామా కోడళ్లు కూడా పోటీ పడిన సందర్భాలు దేశంలో చాలానే ఉన్నాయి. కానీ, ఝరియా విషయంలో మాత్రం తోడికోడళ్లకు టికెట్ల వెనక పెద్ద క్రైమ్ స్టోరీయే ఉంది.

ధన్ బాద్ జిల్లా ఝరియాకు చెందిన సంజీవ్‌ సింగ్, నీరజ్‌ సింగ్‌లు వరుసకు అన్నదమ్ములు అవుతారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన సంజీవ్‌ సింగ్, కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన నీరజ్‌ సింగ్‌‌ ను 30 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఈ ఓటమిని చాలెంజ్ గా తీసుకున్న నీరజ్, సమస్యలపై పోరాటం చేస్తూ, ప్రజాభిమానాన్ని పొందాడు. తమ్ముడికి ప్రజల్లో అభిమానం పెరుగుతోందని రగిలిపోయిన సంజీవ్ సింగ్, 2017 మార్చిలో తమ్ముడైన నీరజ్ సింగ్ ను హత్య చేయించాడు. ఆపై కేసు విచారణలో భాగంగా జైలులో ఉన్నారు.

ఈ సంవత్సరం జార్ఖండ్ కు ఎన్నికలు జరుగనుండగా, నీరజ్ సింగ్ భార్య పూర్ణిమా సింగ్ కాంగ్రెస్ అభ్యర్థినిగా ప్రకటించగా, జైలులో ఉన్న సంజీవ్ సింగ్ భార్య రాగిణీ సింగ్ ను బీజేపీ ఎంచుకుంది. దీంతో తోడికోడళ్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది.

  • Loading...

More Telugu News