Deepika Padukone: తొలి వివాహ వార్షికోత్సవం సందర్భంగా వెంకన్నను దర్శించుకున్న బాలీవుడ్ జంట

  • దీపిక, రణవీర్ ల పెళ్లి బంధానికి ఏడాది పూర్తి
  • వెంకన్న ఆశీస్సులు తీసుకున్న బాలీవుడ్ జంట
  • గత నవంబర్ 14, 15 తేదీల్లో ఇటలీలో జరిగిన వివాహం

బాలీవుడ్ జంట దీపికా పదుకునే, రణవీర్ సింగ్ లు వివాహబంధంతో ఒక్కటై అప్పుడే ఏడాది గడిచిపోయింది. తమ తొలి వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరిద్దరూ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల వారు ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి సంప్రదాయ వస్త్రధారణతో ఈ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. బెనారసీ చీరలో దీపిక మెరిసిపోగా, కుర్తా, చుడీదార్ ను రణవీర్ ధరించాడు.

గత ఏడాది నవంబర్ 14, 15 తేదీల్లో కొంకణి, సింధు సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం ఇటలీలో జరిగింది. వివాహానంతరం బెంగళూరు, ముంబైలో వారు రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

Deepika Padukone
Ranveer Singh
Bollywood
First Wedding Anniversary
Tirupati
  • Loading...

More Telugu News