Ravi Teja: రవితేజ కొత్త సినిమా టైటిల్ 'క్రాక్'

  • రవితేజ తాజా చిత్రంగా 'డిస్కోరాజా'
  • తదుపరి సినిమా దర్శకుడిగా 'గోపీచంద్ మలినేని 
  •  కీలకమైన పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్  

రవితేజ తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'డిస్కోరాజా' సిద్ధమవుతోంది. వచ్చేనెలలో ఈ సినిమా విడుదల కానుండగా, తదుపరి ప్రాజెక్టును రవితేజ పట్టాలెక్కిస్తున్నాడు. ఆయన తదుపరి సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఉండనుంది. తాజాగా ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేశారు. 'క్రాక్' అనే టైటిల్ ను ఈ సినిమాకి సెట్ చేశారు. ఫస్టు పోస్టర్ పై రవితేజ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు.

ఈ సినిమా ఈ రోజునే పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. కెరియర్ పరంగా రవితేజకి ఇది 66వ చిత్రం. ఈ సినిమాలో ఆయన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికగా శ్రుతి హాసన్ మెరవనుంది. ఇక కీలకమైన పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనుంది., తెలుగులో ఆమెకి ఇది తొలి సినిమా కావడం విశేషం. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను, వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నారు.

Ravi Teja
Sruthi haasan
Varalakshmi Sarath Kumar
  • Loading...

More Telugu News