Odisha: రొయ్యల శుద్ధి కర్మాగారంలో గ్యాస్ లీక్.. 80 మందికి అస్వస్థత

  • ఒడిశాలోని బాలాసోర్‌లో ఘటన
  • శుద్ధి ప్లాంట్ నుంచి లీకైన అమ్మోనియా వాయువు
  • అస్వస్థతకు గురైన వారిలో అత్యధికులు మహిళలే

రొయ్యలు శుద్ధి చేసే కర్మాగారంలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీకైన ఘటనలో 80 మంది అస్వస్థతకు గురయ్యారు. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిందీ ఘటన. రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్‌లో ప్రమాదకర అమ్మోనియా వాయువు లీక్ కావడంతో అందరూ ఒక్కసారిగా అస్వస్థతకు గురై ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. వెంటనే వారిని ఖంతపడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అనంతరం మెరుగైన చికిత్స కోసం బాలాసోర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువమంది మహిళలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్యాస్ లీకేజీకి గల కారణాలను ఆరా తీస్తున్నారు. కాగా, అస్వస్థతకు గురైన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

Odisha
balasore
Gas leak
  • Loading...

More Telugu News