Varun tej: వరుణ్ తేజ్ కి తల్లిగా రమ్యకృష్ణ!

  • కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ 
  • తండ్రి పాత్రలో కనిపించనున్న మాధవన్
  • త్వరలో సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు 

వరుణ్ తేజ్ కథానాయకుడిగా చేయనున్న ఒక సినిమా కోసం రమ్యకృష్ణతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ఒక వార్త రెండు రోజులుగా షికారు చేస్తోంది. అయితే సురేందర్ రెడ్డి సినిమాకోసం ఆమెను అడుగుతున్నారా? లేదంటే కిరణ్ కొర్రపాటి సినిమా  కోసం అడుగుతున్నారా? అనే సందేహమే ఫిల్మ్ నగర్లో వినిపించింది. రమ్యకృష్ణను సంప్రదించింది కిరణ్ కొర్రపాటి సినిమా కోసమేననేది తాజా సమాచారం.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ తల్లిగా రమ్యకృష్ణ కనిపించనుందని అంటున్నారు. ఆ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉండటం వలన ఆమెను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆమె భర్త పాత్రకిగాను మాధవన్ ను అడుగుతున్నారట. దాదాపు ఆ పాత్రకి ఆయన ఖరారైపోవచ్చని అంటున్నారు. ఈ మధ్య వచ్చిన 'సవ్యసాచి'లో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను చేసిన మాధవన్, త్వరలో 'నిశ్శబ్దం' చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించనున్నాడు.

Varun tej
Ramya Krishna
Madhavan
  • Loading...

More Telugu News