Balakrishna: క్యాన్సర్ బాధితురాలికి బాలకృష్ణ ఆత్మీయ పరామర్శ

  • ఎముకల క్యాన్సర్ తో బాధపడుతున్న అనంతపురం విద్యార్థిని
  • బసవతారకం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు
  • ధైర్యం చెప్పిన బాలయ్య

ఎముకల క్యాన్సర్ తో బాధపడుతున్న స్వప్న అనే విద్యార్థినికి నందమూరి బాలకృష్ణ ధైర్యవచనాలు పలికారు. అనంతపురంకు చెందిన స్వప్న కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. ఆమె విషయం తెలుసుకున్న బాలకృష్ణ తమ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం స్వప్న హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు పొందుతోంది.

తాజాగా, స్వప్నను బాలయ్య పరామర్శించారు. ఎంతో ఆప్యాయంగా ఆ విద్యార్థినితో మాట్లాడిన ఆయన భయపడాల్సిన పనిలేదంటూ ధైర్యం చెప్పారు. డాక్టర్లతో మాట్లాడి ఆమె ఆరోగ్య స్థితి వివరాలు తెలుసుకున్నారు. బాలయ్య ఆత్మీయత చూసి ఆ విద్యార్థిని ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. కాగా, మరికొన్నిరోజుల్లో స్వప్నకు శస్త్రచికిత్స నిర్వహించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాలయ్య ఆమెను పరామర్శించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన స్వప్నకు పలు కానుకలు కూడా అందించారు.

Balakrishna
Swapna
Anantapur District
Cancer
Hyderabad
  • Loading...

More Telugu News