Andhra Pradesh: ఏపీని ప్రత్యేక దృష్టితో చూడాలి: కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ కు రాష్ట్ర మంత్రి బుగ్గన వినతి

  • దీర్ఘకాలిక లాభాలే లక్ష్యంగా పథకాలు రూపొందించాం  
  • గత ప్రభుత్వం 40వేల కోట్ల రూపాయల అప్పును అందించింది
  • కొత్తగా అప్పులు తీసుకోకుండా చేశారు

ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేక దృష్టితో చూడాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. ప్రీ బడ్జెట్ కన్సల్టేషన్స్ లో భాగంగా ఢిల్లీలో  కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ను బుగ్గన కలిశారు. రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ తయారీలో రాష్ట్ర ప్రభుత్వానికి అధిక కేటాయింపుల కోసం ప్రతిపాదనలు చేశారు.

 అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడారు. దీర్ఘకాలిక  లాభాల దృష్ట్యా పథకాలను రూపొందించామని కేంద్రమంత్రికి తెలిపానని అన్నారు. పథకాలపై ఎవరి ప్రాముఖ్యత వారిదేనని ఈ సందర్భంగా కేంద్ర మంత్రితో అన్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం తమకు 40వేల కోట్లరూపాయల అప్పును అందించిందని, కొత్తగా అప్పులు తీసుకునే పరిస్థితి లేకుండా చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు చనిపోతున్నారన్నది నిజంకాదన్నారు. ఇలా అసత్యాలు మాట్లాడటం చంద్రబాబు స్థాయికి తగదని పేర్కొన్నారు.

Andhra Pradesh
finance minister buggana Rajendhranath Reddy
Meets central Finance Minister
Nirmala Sitharaman
  • Loading...

More Telugu News