Kalva: ఆయనకు తెలుగు మాట్లాడటం రాదు కాబట్టి ఇంకెవరూ నేర్చుకోవద్దన్నట్లు జీవో జారీ చేశారు: కాలవ శ్రీనివాసులు

  • మాతృభాష తెలుగును మృత భాషగా మార్చేందుకు జగన్ యత్నిస్తున్నారు
  • ప్రాథమిక దశలోనే మాతృభాషను చంపే ప్రయత్నం చేస్తున్నారు
  • తెలుగు, ఇంగ్లీష్ రెండు మాధ్యమాల్లో విద్యా బోధన ఉండాలి

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శలు గుప్పించారు. మాతృభాష తెలుగును మృత భాషగా మార్చేందుకు జగన్ యత్నిస్తున్నారని అన్నారు. జగన్ కు తెలుగులో మాట్లాడటం సరిగా రాదని... అందుకే ఇంకెవరూ తెలుగు మాట్లాడకూడదన్నట్లు ఇంగ్లీష్ మీడియం జీవో జారీ చేశారని ఎద్దేవా చేశారు. ఇంగ్లీషు నేర్చుకోవద్దని ఎవరూ చెప్పరని... కానీ, ప్రాథమిక దశలోనే మాతృభాషను చంపే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. తెలుగు, ఇంగ్లీష్ రెండు మాధ్యమాల్లో విద్యా బోధన ఉండాలని చెప్పారు.

Kalva
Jagan
English Medium
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News