KCR: కేసీఆర్ పెద్ద మనసు.. తన అటెండర్ కూతురు పెళ్లికి హాజరుకానున్న సీఎం
- మియాపూర్ లో లక్ష్మీనారాయణ కూతురు పెళ్లి
- సతీసమేతంగా హాజరుకానున్న కేసీఆర్
- వధూవరులను ఆశీర్వదించనున్న సీఎం
తన వద్ద పని చేసే సిబ్బంది పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో మమకారంతో ఉంటారనే సంగతి తెలిసిందే. తనకు వ్యక్తగత సహాయకుడిగా ఉండే ఓ యువకుడికి గతంలో కేసీఆర్ దగ్గరుండి పెళ్లి జరిపించారు. తాజాగా ప్రగతి భవన్ లో అటెండర్ గా పని చేస్తున్న లక్ష్మీనారాయణ కూతురు పెళ్లికి కేసీఆర్ హాజరుకానున్నారు. మియాపూర్ లో ఈ రోజు ఆమె వివాహం జరగనుంది. ఈ పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. ఈ వివాహానికి సతీసమేతంగా కేసీఆర్ హాజరుకానున్నారు.