Ayodhya: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కి సొంతగడ్డపై ఘనస్వాగతం

  • అయోధ్య వివాదంపై సుప్రీం తీర్పు
  • రంజన్ గొగోయ్ నేతృత్వంలో కీలక తీర్పు ఇచ్చిన సుప్రీం ధర్మాసనం
  • గువాహటి వెళ్లిన రంజన్ గొగోయ్

భారతదేశ చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన సమస్యగా వినుతికెక్కిన అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు అంతిమతీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల అత్యున్నత ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులదేనంటూ తీర్పునిచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పేరు మార్మోగిపోతోంది.

తాజాగా ఆయన తన స్వరాష్ట్రం అసోం వెళ్లగా అక్కడ అపూర్వరీతిలో స్వాగతం లభించింది. గువాహటి విమానాశ్రయానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఓ రాజకీయనాయకుడి తరహాలో ఆయనకు స్వాగతం పలికారు. రంజన్ గొగోయ్ 'కోర్ట్స్ ఆఫ్ ఇండియా 'అనే పుస్తకం అసోం వెర్షన్ ను ఆవిష్కరించేందుకు గువాహటి చేరుకున్నారు. ఆయన విమానం దిగీదిగగానే శాలువాలతో సత్కరించేందుకు పోటీలు పడ్డారు.

  • Loading...

More Telugu News