Galla Jaydev: గల్లా జయదేవ్ గారు నన్నో సోదరుడిలా చూస్తారు: రామ్ చరణ్

  • అశోక్ గల్లా తొలి సినిమా షూటింగ్ ప్రారంభం
  • క్లాప్ కొట్టిన రామ్ చరణ్
  • గల్లా జయదేవ్ తో ఎంతో అనుబంధం ఉందని చరణ్ వెల్లడి

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా వెండితెరకు పరిచయం అవుతున్న సందర్భంగా తొలి సినిమా షూటింగ్ ఇవాళ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ, తనకు గల్లా జయదేవ్ గారితో ఎంతో అనుబంధం ఉందని తెలిపారు.

ఆయన తనను ఓ సోదరుడిలా చూసుకుంటారని, ఇప్పుడాయన తనయుడు అశోక్ గల్లా హీరోగా వస్తున్న చిత్రానికి క్లాప్ కొట్టేందుకు తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందని వెల్లడించారు. ఈ సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్న గల్లా పద్మావతి గారికి, హీరో అశోక్ కు, హీరోయిన్ నిధి అగర్వాల్ కు ఈ సినిమాతో మంచి పేరు రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. గతంలో గల్లా జయదేవ్, మహేశ్ బాబు కుటుంబాలతో కలిసి రామ్ చరణ్ విహారయాత్రలకు కూడా వెళ్లారు.

Galla Jaydev
Ramcharan
Ashok Galla
Tollywood
  • Loading...

More Telugu News