Prabhudeva: ప్రభుదేవా డ్యాన్స్ స్టెప్పులు వేయలేక... గాయపడిన దిశాపఠానీ!

  • సల్మాన్ సరసన నటిస్తున్న దిశా పఠానీ
  • 'రాధే' పాట కోసం డ్యాన్స్ ప్రాక్టీస్
  • గాయపడ్డానని ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడి

ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా కంపోజ్ చేసే డ్యాన్స్ మూమెంట్స్ ఎంత క్లిష్టంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిస్తున్న 'రాధే' చిత్రంలో దిశా పఠానీ నటిస్తోంది. ఇక ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాగా, ఓ సాంగ్ నిమిత్తం డ్యాన్స్ మూమెంట్స్ ప్రాక్టీస్ చేస్తూ, దిశా, తన మోకాళ్లను గాయపరచుకుంది.

ఇందుకు సంబంధించిన దృశ్యాన్ని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఆమె, ప్రభుదేవా పాట షూటింగ్ అంటే ఇట్లే ఉంటుందని కామెంట్ పెట్టింది. ఇటీవలే సల్మాన్ తో కలిసి 'భారత్' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్న దిశా పఠానీ, ఆపై రెండు సినిమాలను పూర్తి చేసింది. ప్రస్తుతం సల్మాన్ తో రెండోసారి నటించే చాన్స్ కొట్టేసింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News