Supreme Court: సహచర న్యాయమూర్తులతో విందులో పాల్గొన్న జస్టిస్‌ గొగోయ్‌

  • ఈనెల 17న పదవీ విరమణ చేస్తున్న సుప్రీం చీఫ్‌ జస్టిస్‌
  • నిన్న అయోధ్య తీర్పు అనంతరం విందు ప్రకటన చేసిన జస్టిస్‌
  • తాజ్‌మాన్‌సింగ్‌ హోటల్‌లో ఆతిథ్యం

మరో వారం రోజుల్లో పదవీ విరమణ చేయనుండడం, అటువంటి సమయంలో అందరికీ ఆమోద యోగ్యమైన కీలక అయోధ్య తీర్పు ఇవ్వడం వంటి సుమధుర ఘట్టాల నేపధ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ నిన్న సహచర న్యాయమూర్తులకు విందు ఇచ్చారు. తీర్పు అనంతరం సహచరులకు విందు ఇవ్వనున్నట్లు ముందే ప్రకటించిన చీఫ్‌ జస్టిస్‌ ఢిల్లీలోని తాజ్‌మాన్‌సింగ్‌ హోటల్‌లో ఆతిథ్యాన్ని ఏర్పాటు చేశారు.

ఈ విందుకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌ హాజరయ్యారు. తీర్పు అనంతరం  సహచర న్యాయమూర్తులను గొగోయ్‌ స్వయంగా తోడ్కోని వెళ్లడం విశేషం. సుప్రీం కోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న గొగోయ్‌ పదవీ కాలం ఈనెల 17వ తేదీతో ముగియనున్న విషయం తెలిసిందే.

Supreme Court
chief justice
treat
hotel tajmansingh
  • Loading...

More Telugu News