Telugudesam leader Varla Ramaiah: చంద్రబాబు దీక్ష వైసీపీ ప్రభుత్వం మెడకు చుట్టుకోబోతోంది: టీడీపీ నేత వర్ల రామయ్య

  • మంత్రి బొత్స బినామీలకు 50 ఇసుక లారీలున్నాయని ఆరోపణ
  • కార్మికుల ఆత్మహత్యలపై పెద్దిరెడ్డి వ్యాఖ్యలు దారుణమన్న వర్ల
  • మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యలు

ఏపీలో భవన నిర్మాణ కార్మికులపై మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు దారుణమని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో భవన నిర్మాణ కార్మికులు కాలంచెల్లి చనిపోతున్నారని వైసీపీ నేతలు అవహేళన చేస్తున్నారని, మరి కాలంచెల్లి చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా ఎందుకు చెల్లిస్తున్నట్టు అని  టీడీపీ నేత వర్ల రామయ్య నిలదీశారు.

తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన దీక్ష జగన్ ప్రభుత్వం మెడకు చుట్టుకోబోతుందని చెప్పారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి బొత్స సత్యనారాయణ బినామీలకు 50 ఇసుక లారీలు ఉన్నాయని ఆరోపించారు. విజయనగరంలో ఇసుక అక్రమ రవాణాపై బొత్స, ఎంపీ మధ్య విభేదాలున్నాయని చెప్పారు.

Telugudesam leader Varla Ramaiah
Criticism on YSRCP govt
Sand scarcity
benami lorries
  • Loading...

More Telugu News