Vijayasanthi: తీర్పు ఉభయ తారకంగా ఉంది... శాశ్వత పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నా: అయోధ్య తీర్పుపై విజయశాంతి వ్యాఖ్యలు

  • అయోధ్యపై సుప్రీం తీర్పు
  • అందరూ గౌరవించాలన్న విజయశాంతి
  • భారతీయులుగా ముందుకు నడుద్దామని పిలుపు

అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు తుది తీర్పు వెల్లడించడంపై తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు ఉభయ తారకంగా ఉందని అభిప్రాయపడ్డారు. మూడు దశాబ్దాల అయోధ్య వివాదానికి సుప్రీం ఇచ్చిన తీర్పుతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నానని, ఈ అంశాన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలని పిలుపునిచ్చారు. తీర్పును అందరూ గౌరవించాలని తెలిపారు.

ఇది కీలక సమయం అని ప్రతి పౌరుడు గుర్తించాలని, తదనుగుణంగా ప్రజాస్వామ్యాన్ని, శాంతిని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు తమ వంతు ధర్మం నిర్వర్తించాలని సూచించారు. భిన్నత్వంలో ఏకత్వం చాటిచెప్పాల్సిన తరుణం ఇదేనని, అందరం భారతీయులం అనే సంకల్పంతో ముందుకు నడుద్దాం అంటూ ఫేస్ బుక్ లో వ్యాఖ్యానించారు.

Vijayasanthi
Ayodhya
Supreme Court
Congress
  • Loading...

More Telugu News