Telugu cinema: త్వరలో నిర్మాతగా మారనున్న ఎన్టీఆర్?

  • సొంత నిర్మాణ సంస్థ ఏర్పాటు దిశగా అడుగులు
  • ఇప్పటికే ఈ బాట పట్టిన హీరోలు మహేశ్ బాబు, ప్రభాస్ ల దారిలో సాగాలని నిర్ణయం
  • త్వరలోనే సొంత సంస్థ ఏర్పాటును ప్రకటించే అవకాశం

స్టార్ డమ్ అందుకున్న సినీ నటులు హీరోలుగా కొనసాగుతూనే, నిర్మాతలుగా కూడా మారిపోతున్నారు. తాజాగా ఎన్టీఆర్ కూడా నిర్మాతగా మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మహేశ్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, నాని, విజయ్ దేవరకొండ సహా మరికొంత మంది హీరోలు చిత్ర నిర్మాణరంగంలోకి దిగి సక్సెస్ లు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా వారి బాటలో సాగనున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన నిర్మాణ సంస్థకు సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశముంది. ప్రస్తుతం ఎన్టీఆర్, ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో నటిస్తున్నారు. దీని తర్వాత కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్న సినిమాలో నటించనున్నారు.

Telugu cinema
NTR
Production
Producer
  • Loading...

More Telugu News