Ayodya: తీర్పు కాపీని పరిశీలించాక భవిష్యత్తు కార్యాచరణ : సున్నీ వక్ఫ్ బోర్డు
- కోర్టు తీర్పు అంత సంతృప్తికరంగా లేదు
- మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి
- అయినా న్యాయస్థానం ఆదేశాలను గౌరవిస్తున్నాం
అయోధ్యలోని వివాదాస్పద స్థలం రామ్‌జన్మభూమి న్యాస్‌కే చెందుతుందని, ప్రత్యామ్నాయంగా సున్నీబోర్డుకు అయోధ్యలోనే ఐదెకరాల స్థలం ఇవ్వాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పుపై సున్నీ వక్ఫ్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది.
కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని చెబుతూనే న్యాయస్థానం ఆదేశాలపై తమకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని తెలిపింది. కోర్టు తీర్పు ప్రతిని పూర్తిగా పరిశీలించాక తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపింది. అన్ని విషయాలు చర్చించిన అనంతరం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపింది. అన్ని వర్గాలు శాంతియుతంగా ఉండాలని, సంయమనం పాటించాలని కోరింది. ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టవద్దని విజ్ఞప్తి చేసింది.