Sai Dharam Tej: డబ్బింగ్ పనులు కానిచ్చేస్తున్న 'ప్రతిరోజూ పండగే'

  • మారుతి నుంచి 'ప్రతిరోజూ పండగే'
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
  • కీలకమైన పాత్రలో సత్యరాజ్

మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా 'ప్రతిరోజూ పండగే' సినిమా రూపొందుతోంది. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ఇప్పటికే ముగింపు దశకి చేరుకుంది. రాశి ఖన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాను డిసెంబర్ 20వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను కూడా చకచకా కానిచ్చేస్తున్నారు.

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ తన పాత్రకి సంబంధించిన డబ్బింగ్ చెబుతున్నాడు. కుటుంబం అంటే ఒక కప్పు కింద కొంతమంది కలిసి ఉండటం కాదు .. ఒకరి మనసులో ఒకరు ఉండటం. అనుబంధాల కోవెలే అసలైన కుటుంబం అని చాటిచెప్పే కథ ఇది. ఈ సినిమాలో తేజూకి తాత పాత్రలో సత్యరాజ్ కనిపించనున్నారు. ఈ సినిమాకి ఆయన పాత్ర హైలైట్ అవుతుందని అంటున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా, తేజూకి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.

Sai Dharam Tej
Rasi Khanna
Sathya Raj
  • Loading...

More Telugu News