Royal bengal tiger: విశాఖలో రాయల్ బెంగాల్ టైగర్ సీత మృతి

  • అప్పట్లో సామ్రాట్ సర్కస్ కంపెనీ నుంచి తెచ్చిన పులి 
  • రాంచీలోని బీబీఎం జూ నుంచి విశాఖకు తరలింపు
  • విశాఖ పునరావాస కేంద్రంలో మృతి

2004లో సామ్రాట్ సర్కస్ నుంచి అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్న రాయల్ బెంగాల్ టైగర్ సీత మృతి చెందింది. దీని వయసు 27 సంవత్సరాలు. సర్కస్‌లలో పులులను వినియోగించరాదన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అధికారులు దీనిని స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి 2006 వరకు రాంచీలోని బీబీఎం జూపార్క్‌లో దీనిని ఉంచారు. ఆ తర్వాత విశాఖపట్టణంలోని జంతు పునరావాస కేంద్రానికి మార్చారు. తాజాగా ఇది మృతి చెందినట్టు పునరావాస కేంద్ర అధికారులు తెలిపారు.

Royal bengal tiger
seetha
Visakhapatnam District
  • Loading...

More Telugu News