Telangana: కాంగ్రెస్ నేతలు పొన్నం, షబ్బీర్, గీతారెడ్డి, పొన్నాల హౌస్ అరెస్ట్.. టీటీడీపీ నేత శ్రీపతి సురేశ్ అరెస్ట్

  • తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ‘చలో ట్యాంక్‌బండ్’కు పిలుపు
  • వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు
  • లాలాగూడ పోలీస్ స్టేషన్‌కు శ్రీపతి సతీశ్

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ‘చలో ట్యాంక్‌బండ్’ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కార్యక్రమానికి వెళ్లకుండా కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.  టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, మాజీ మంత్రి గీతారెడ్డిలను హైదరాబాద్ పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకోగా, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను  హన్మకొండలో గృహ నిర్బంధం చేశారు. టీటీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీపతి సతీష్‌ను గత అర్ధరాత్రి 12 గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మారేడ్‌పల్లికి తరలించిన పోలీసులు ఆ తర్వాత లాలాగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Telangana
tsrtc
chalo tankbund
Congress
Telugudesam
  • Loading...

More Telugu News