Puja Hegde: పూజా హెగ్డే విహారయాత్ర... ఫొటోలు ఇవిగో!
![](https://imgd.ap7am.com/thumbnail/tn-d325ff96eae8.jpg)
- ఇది రీఫ్రెష్ ట్రిప్ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్
- అభిమానులను ఆకట్టుకుంటున్న సౌదీ, మక్కాలో దిగిన ఫొటోలు
- ప్రస్తుతం ఫ్రాన్స్ లో విహరిస్తోన్న పూజా
బాలీవుడ్ నటి పూజాహెగ్డే విదేశాల్లో విహరిస్తోంది. తన అందచందాలతో ఆకట్టుకునే ఈ నటి ప్రస్తుతం తెలుగులో పలు సినిమాలు చేస్తూ మంచి డిమాండులో వుంది. ఇటీవల సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండటంతో, కొంచెం రీఫ్రెష్ కావడానికి విదేశాలకు విహారయాత్రకు వెళ్లానని ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొంది. సౌదీ అరేబియా, మక్కా తదితర ప్రాంతాల్లో దిగిన ఫొటోలను పెడుతూ.. ‘అందమైన నిర్మాణాలు, రుచికరమైన ఆహారం ఇది మరిచిపోలేని ట్రిప్’ అని పోస్ట్ చేసింది.
కాగా, పూజా ప్రస్తుతం ఫ్రాన్స్ లో వుంది. త్రివిక్రమ్ రూపొందిస్తున్న ‘అల వైకుంఠపురములో’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పారిస్ లో జరుగుతోంది. మరోపక్క, కె.రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తోన్న సినిమాలో కూడా పూజా నటిస్తోంది. ఇటీవల పూజాహెగ్డే నటించిన ‘హౌస్ పుల్ 4’ హిందీ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు 150 కోట్ల రూపాయలు వసూలు చేసిందని సమాచారం.
![](https://img.ap7am.com/froala-uploads/froala-60702c7f893c7856b5a11219f3d77b3463143d1e.jpeg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-282c258a04d1f7f79bd9b5837ffe84c425e10a03.jpeg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-1cf7534ff21517e9f6c7b97f747228c46a350f36.jpeg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-542a2f0f441f29b949fcedbe6566df7dde410c9a.jpeg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-9848b751704f7350d7dd99b8b95ff5f07a0ce25f.jpeg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-228f93168551b326a97ed579abc18d6b9b9cc1b0.jpeg)