Kala Venkat Rao: చంద్రబాబుపై స్పీకర్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: కళా వెంకట్రావు

  • స్పీకర్ గా ఉన్న వ్యక్తి ప్రజలకు ఆదర్శంగా ఉండాలని హితవు
  • ఏపీలో ఇసుక కొరతకు కారణం ప్రభుత్వమేనని ఆరోపణ
  • ఆన్ లైన్ లో అమ్ముకుంటున్నారంటూ ధ్వజమెత్తిన కళా

స్పీకర్ గా ఉన్న వ్యక్తి ప్రజలకు ఆదర్శంగా ఉండాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. ఇటీవల  తమ పార్టీ అధినేత చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు పెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని పేర్కొన్నారు.

చీఫ్ సెక్రెటరీని ఎందుకు బదిలీ చేశారో ప్రభుత్వం వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇసుక కొరతకు ప్రభుత్వమే కారణమని, ఇసుక కొరతను సృష్టించేది కూడా వైసీపీ నేతలేనని ఆరోపించారు. ఆన్ లైన్ లో ఇసుకను వైసీపీ వాళ్లే ఖాళీ చేస్తున్నారని, విశాఖలో ఇసుకను అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలను మంత్రులు అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kala Venkat Rao
Thammineni
sand
scarcity creating
Andhra Pradesh
speaker
Assembly
  • Loading...

More Telugu News