Sourav Ganguly: యువ ఆటగాడు పంత్ కు బాసటగా నిలిచిన గంగూలీ

  • పంత్ కు సమయం ఇవ్వాలన్న గంగూలీ
  • నిదానంగా పరిణతి సాధిస్తున్నాడని వెల్లడి
  • పంత్ ను సూపర్ ప్లేయర్ గా అభివర్ణించిన దాదా

టీమిండియా కెప్టెన్ గా వ్యవహరించిన సమయంలో యువ ఆటగాళ్లను పైకి తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేసిన సౌరవ్ గంగూలీ ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో అదే వైఖరి ప్రదర్శిస్తున్నారు. కొంతకాలంగా ఆశించిన స్థాయిలో ఆడలేకపోతున్న యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు మద్దతుగా మాట్లాడారు. పంత్ సూపర్ ఆటగాడని, నిదానంగా పరిణతి సాధిస్తున్నాడని తెలిపారు. పంత్ కు కొంత సమయం ఇవ్వాలని, కాలం గడిచేకొద్దీ అతడే మెరుగవుతాడని అభిప్రాయపడ్డారు. మహేంద్ర సింగ్ ధోనీ లేని లోటు కనిపిస్తోందా? అని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు గంగూలీ పైవిధంగా సమాధానం ఇచ్చారు.

Sourav Ganguly
Pant
Cricket
Team India
BCCI
  • Loading...

More Telugu News