JC Diwaker Reddy: తప్పు చేస్తే ప్రాణ త్యాగానికైనా సిద్ధమే... అవసరమైతే కోర్టుకు వెళతా: జేసీ దివాకర్ రెడ్డి

  • ఉద్దేశపూర్వకంగానే తమ బస్సులను టార్గెట్ చేశారని ఆరోపణ
  • వైసీపీలోకి వస్తే అన్నీ సర్దుకుంటాయని సంకేతాలిచ్చారని వెల్లడి
  • జరిగిన నష్టాన్ని అధికారులే భరించాలన్న జేసీ

తమ పార్టీలోకి వస్తే అన్నీ సర్దుకుంటాయని కొంతమంది వైసీపీ నేతలు తనకు సూచించారని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఇటీవల జేసీకి చెందిన దివాకర్ ట్రావెల్స్ సంస్థ బస్సులను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో తన ఒక్కడిపైనే దాడి జరుగుతోందని అన్నారు. నిబంధనల ప్రకారం ట్రావెల్స్ నడుపుతున్నప్పటికీ కక్షపూరితంగా తమ బస్సులు సీజ్ చేస్తున్నారన్నారు.

తాను తప్పు చేస్తే ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని ఆయన చెప్పారు. తనకు జరిగిన నష్టాన్ని అధికారులే భరించాలని కోరుతూ నోటీసులు ఇస్తానని, అవసరమైతే కోర్టుకు వెళతానని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యదర్శికే దిక్కులేదని, జగన్ కొట్టిన దెబ్బకు ఎల్వీ సుబ్రమణ్యం బాపట్లలో పడ్డారని, సీఎంది బలమైన దెబ్బని జేసీ వ్యాఖ్యానించారు. చింతమనేని ప్రభాకర్ బయటకు రాకుండా కేసుల మీద కేసులు పెడుతున్నారని విమర్శించారు.

JC Diwaker Reddy
Comments on YSRCP Government
Jagan
Seized
Diwakar Travels
  • Loading...

More Telugu News