Andhra Pradesh: సామాజిక న్యాయం కోసం సీఎం జగన్ చేస్తోన్న కృషి ఎనలేనిది: ప్రముఖ నటుడు నారాయణమూర్తి

  • ప్రభుత్వ పాలన అద్భుతంగా కొనసాగుతోందని కితాబు
  • స్వాతంత్ర్యం వచ్చాక ఎవరూ చేయనంత అభివృద్ధి చేస్తున్నారని ప్రశంస
  • బీసీలకు మేలు చేయాలన్న ప్రయత్నం ఫలించాలని ఆకాంక్ష

సామాజిక న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తోన్న కృషిని ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి ప్రశంసించారు. ప్రభుత్వ పాలన అద్భుతంగా కొనసాగుతోందని అభినందనలు తెలియజేశారు. ఈ రోజు నారాయణమూర్తి మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చాక ఎవరూ చేయని అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు జగన్ చేపట్టి అమలు చేస్తున్నారన్నారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రిజర్వేషన్ల కోసం పార్లమెంట్ లో బిల్లు పెట్టించినందుకు జగన్ కు అభినందనలు తెలిపారు.

Andhra Pradesh
CM Jagan
Actor R Narayana Murthy
Administration
Praised coments
  • Loading...

More Telugu News