Anchor Pradeep: తన ఆరోగ్యంపై వస్తున్న కథనాలపై యాంకర్ ప్రదీప్ వివరణ

  • క్షీణించిన ప్రదీప్ ఆరోగ్యం అంటూ కథనాలు
  • స్పందించిన ప్రదీప్
  • కాలికి చిన్న దెబ్బ తగిలిందని వెల్లడి

గత కొన్నిరోజులుగా యూట్యూబ్ లో యాంకర్ ప్రదీప్ ఆరోగ్యంపై విపరీతంగా కథనాలు వస్తున్నాయి. క్షీణించిన ప్రదీప్ ఆరోగ్యం అంటూ కథనాలు ప్రచారం జరుగుతుండడం పట్ల యాంకర్ ప్రదీప్ స్వయంగా వివరణ ఇచ్చాడు. కొన్నిరోజుల క్రితం కాలికి గాయం అయిందని, ఎక్కువ సేపు నిలబడొద్దని డాక్టర్లు చెప్పినా కొన్ని షోలు చేశానని, దాంతో నొప్పి ఎక్కువ కావడంతో తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. అంతకుమించి మరే అనారోగ్యం లేదని స్పష్టం చేశాడు.

అయితే, కొన్ని రోజులుగా షూటింగ్స్ లో పాల్గొనలేదని, ఈ కారణంగానే తనకు ఏదో అయిందంటూ వదంతులు పుట్టుకొచ్చాయని ప్రదీప్ వెల్లడించారు. తాను నిజంగానే తీవ్ర అనారోగ్యం పాలయ్యాననుకుని చాలామంది సన్నిహితులు ఆందోళన చెందారని, ఫోన్ చేసి ఏమైందని అడుగుతున్నారని వెల్లడించాడు. తనకోసం అంతమంది స్పందిస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని, మరో వారం రోజుల్లో షూటింగ్ కు హాజరవుతానని తెలిపాడు.

Anchor Pradeep
Youtube
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News