Rohit Sharma: రోహిత్ శర్మ ఆటతీరుపై బంగ్లాదేశ్ కెప్టెన్ వ్యాఖ్యలు

  • రాజ్ కోట్ టి20లో బంగ్లా జట్టు ఓటమి
  • రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్
  • రోహిత్ ను ఆపడం తమ వల్ల కాలేదన్న మహ్మదుల్లా

రాజ్ కోట్ లో బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో టీమిండియా సారథి రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడం తెలిసిందే. కేవలం 43 బంతుల్లోనే 85 పరుగులు చేశాడు. వాటిలో 6 ఫోర్లు, 6 భారీ సిక్సులున్నాయి. దీనిపై బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా వ్యాఖ్యానించాడు. తాము రోహిత్ శర్మను నిలువరించలేకపోయామని అంగీకరించాడు. అతడి జోరుకు తమ బౌలర్లు బేజారెత్తిపోయారని, ఇలాంటి పిచ్ పై రోహిత్ శర్మను నియంత్రించడం ఎంతో కష్టం అని అభిప్రాయపడ్డాడు. 175కి పైగా పరుగులు చేసుంటే తాము మ్యాచ్ ను కాపాడుకునేందుకు అవకాశాలు ఉండేవని మహ్మదుల్లా పేర్కొన్నాడు.

Rohit Sharma
Bangladesh
India
Mahmadullah
Cricket
T20
Rajkot
  • Loading...

More Telugu News