Galla Jaydev: మా వాడికి మీ ఆశీస్సులు కావాలి: గల్లా జయదేవ్

  • హీరోగా పరిచయం అవుతున్న జయదేవ్ తనయుడు అశోక్ గల్లా
  • ముహూర్తం షాట్ కు అందరికీ ఆహ్వానం పలికిన గల్లా జయదేవ్
  • ఫేస్ బుక్ లో పోస్టు

గుంటూరు ఎంపీ, టీడీపీ నేత గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. గల్లా జయదేవ్ అర్ధాంగి పద్మావతి నిర్మిస్తున్న చిత్రం ద్వారానే అశోక్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. దీనిపై గల్లా జయదేవ్ ఫేస్ బుక్ ద్వారా స్పందించారు. తన కుమారుడు గల్లా అశోక్ ను వెండితెర అరంగేట్రం చేయిస్తున్నామని, మీ అందరి ఆశీస్సులు కావాలని పోస్టు చేశారు.

అమర రాజా మీడియా అండ్ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రం నవంబరు 10 ఆదివారం ఉదయం 11.15 గంటలకు ఫిలింనగర్ లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అవుతుందని తెలిపారు. తన కుమారుడి తొలి చిత్రం ముహూర్తం షాట్ కు అందరూ విచ్చేసి దీవించాలని కోరుకుంటున్నట్టు తన భార్య పద్మావతితో కలిసి గల్లా జయదేవ్ ఆహ్వానం పలికారు.

Galla Jaydev
Ashok Galla
Tollywood
  • Loading...

More Telugu News